Rythu Bharosa scheme: పంట వేసే రైతులకే రైతు భరోసా పథకం..! 12 d ago
రైతు భరోసా స్కీమ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పంట వేసే రైతులకే రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీతక్క మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతును రాజును చేయడమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని సీతక్క పేర్కొన్నారు.